ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 11:45 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

సాధ్విగా మారేందుకు 20 ఏళ్ల యువతికి అనుమతి..

సాధ్విగా మారేందుకు 20 ఏళ్ల యువతికి అనుమతి..

భోపాల్, సెప్టెంబర్ 11, అర్జున్ సమాచారం ప్రతినిధి)

ఓ 20 ఏళ్ల యువతి భౌతిక సుఖాలను త్వజించి, తాను సాధ్విగా మారాలని నిర్ణయించుకుంది. అయితే, తమ కుమార్తె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఆమె బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అందరిలాగేతమ కుమార్తెకు పెళ్లిచేసి, అత్తారింటికి పంపాలని భావించిన ఆ తల్లిదండ్రులు వద్దని వారించారు. కన్న కూతురిపై మమకారంతోనే వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆమె న్యాయస్థానానికి వెళ్లారు.హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో.. విచారణ చేపట్టింది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్దించి, మద్దతు తెలిపింది.ప్రాపంచిక సుఖాలను త్వజించి, సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్న ఓ20 ఏళ్ల యువతికి మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతుగా నిలిచింది. తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే, ఆచరించే ప్రాథమిక హక్కు ఆమెకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, యువతి సహాయంకోరితే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి బలవంతం లేదా వేధింపులు ఎదురుకాకుండా రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఇండోర్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తనీషా అనే యువతిదాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జస్టిస్ సందీప్ ఎన్. భట్ విచారణ చేపట్టారు.తాను శ్వేతాంబర్ జైన ధర్మాన్ని అనుసరించి, సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టు ఆమె కోర్టుకు వివరించారు. అయితే, ఈనిర్ణయాన్ని తన తల్లిదండ్రులు, బంధువులు వ్యతిరేకిస్తూ వేధిస్తున్నారని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. అంతేకాదు, మతపరమైన దీక్షలో తల్లిదండ్రులు, బంధువులు జోక్యం చేసుకోకుండానిరోధించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21, 25, 26 ప్రకారం తనకు లభించే ప్రాథమిక హక్కులను స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి అనుమతించాలని ఆమె కోరారు.పిటిషనర్ తరఫునహాజరైన న్యాయవాది ఆశిష్ జోషి వాదనలు వినిపిస్తూ.. రక్షణ కల్పించాలని ఇండోర్ పోలీస్ కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశామని, అది ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. పిటిషనర్‌పై ఆమెతల్లిదండ్రులు లేదా బంధువుల నుంచి ఎలాంటి వేధింపులు, బలవంతం లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ గర్విత్ జైన్ హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి..మేజర్ అయిన ఆమెకు ‘తనకంటూ ఒక మార్గాన్ని ఎంచుకుని మతాన్ని అనుసరించే, తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది’ అని పేర్కొన్నారు.ఆమె ఇప్పటికే జైన ధర్మాన్ని అనుసరిస్తోందని,ఇప్పుడు ప్రపంచాన్ని విడిచిపెట్టి సాధ్విగా జీవించాలని నిర్ణయించుకుందన్నారు. అయితే తల్లిదండ్రులు, బంధువులు ఆమెపై ఉన్న ప్రేమానురాగాల వల్ల అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టు గుర్తించింది.సమాజంలో పలుకుబడిన కలిగిన తల్లిదండ్రులు తనను దీక్ష తీసుకోనివ్వరనే పిటిషనర్ భయాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.ఈ సందర్భంగా ‘‘పిటిషనర్ పట్ల ఎంత సానుభూతి ఉందో, ఆమెతల్లిదండ్రుల పట్ల కూడా అంతే సానుభూతి ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంటూ, తల్లిదండ్రుల వ్యతిరేకత కూతురిపై ఉన్న మమకారం నుంచే వచ్చిందని గుర్తించింది. అయినప్పటికీ, 18 ఏళ్లు నిండినవ్యక్తికి చట్టపరమైన హక్కుల రక్షణ పొందే హక్కు ఉందని, చట్టం దృష్టిలో ఎవరైనా కలిగించే అడ్డంకులను అనుమతించలేమని స్పష్టం చేసింది.‘లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’ కేసులో సుప్రీంకోర్టుఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. మేజర్లు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వతంత్రులని, అలాంటి వారి ప్రయోజనాలను కాపాడటం కోర్టుల బాధ్యత అని పునరుద్ఘాటించింది.అంతేకాకుండా, పిటిషనర్ దరఖాస్తు చేసుకుంటే పోలీసులు ఎలా వ్యవహరించాలో సూచించడానికి ‘శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తీర్పును కూడా ఉదాహరించింది.పూర్తిస్థాయి ప్రాథమికరక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి బదులుగా హైకోర్టు ఒక పరిష్కారాన్ని చూపింది. తన తల్లిదండ్రులతో సహా ఎవరైనా బలవంతం చేస్తే సహాయం కోరుతూ ఎస్పీ లేదా సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలనిపిటిషనర్‌ను ఆదేశించింది. అలాంటి దరఖాస్తు అందగానే, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి వెంటనే రంగంలోకి దిగి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఈ ఆదేశాలతోహైకోర్టు ఆ రిట్ పిటిషన్‌ను ముగిస్తూ.. పిటిషనర్ సహాయం కోరితే పోలీసులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో, ఒకరి మతపరమైన ఎంపికను వారి కుటుంబం శాసించలేదనిస్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.